సమంత ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిందా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!

ఏంటో .. సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అసలు హీరోయిన్ సమంత పై మాత్రమే ఎందుకు ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి అనేది అభిమానులకి కూడా అర్థం కావడం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

తనకు నచ్చిన వాళ్లతో తిరుగుతుంది .. నచ్చినట్లు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే హీరోయిన్ సమంత తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ పై ఫ్యాన్స్ కూడా సముఖంగా లేకపోవడం గమనార్హం . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ గా మారింది. సమంత గతంలో ఒక హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చింది అనే విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

హీరోయిన్ సమంత ..ప్రణిత సుభాష్ కు వార్నింగ్ ఇచ్చిందట. వీళ్ళిద్దరూ అత్తారింటికి దారేది సినిమాలో కలిసిన నటించారు. అలాగే ఎన్టీఆర్ రభస సినిమాలో కూడా కలిసి నటించారు. ఈ మూమెంట్లోనే వాళ్ళ మధ్య కొన్ని మిస్ అండర్స్టాండింగ్ వచ్చాయట . అంతేకాదు సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన ఉంటే ప్రణీత.. నన్నవరు చూస్తారు అనే విధంగా మాట్లాడిందట . దీంతో హీరోయిన్ సమంత ఆమెపై కోప్పడిందట . టాలెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు.. స్టేటస్ క్రేజ్ కాదు.. హిట్ ట్రాక్ అంతకన్నా కాదు.. ఏం మాయ చేసావే టైంలో నాకు అసలు హిట్ ఏ పడలేదు ..కానీ జనాలు నన్ను ఆదరించారు ..మనలో నటన టాలెంట్ ఉండాలి అన్న రేంజ్ లో ఇచ్చిపడేసిందట . ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ఇష్యూస్ మొదలయ్యాయి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే వార్తను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!