విడాకులు తిసుకున్న ఆ హీరోయిన్ రోల్ లో అంజలి.. మొత్తం పెంట పెంట చేసేసుకుంటుందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఈ వార్త టాలీవుడ్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి ఇప్పుడు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది తో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . అంతేకాదు ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది . పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది .

రీసెంట్గా అంజలికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . అంజలి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ కి ఓకే చేసిందట. కోలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న స్టార్ కపుల్ బయోపిక్ తెరకెక్కబోతుందట. ఈ క్రమంలోనే ఆ భార్యాభర్తల మధ్య ఏం జరిగింది ..? అసలు తప్పు ఎవరిది? ఎవరు ముందు విడాకులు అడిగారు..? అనే విషయాలను డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడట .

ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రాజెక్టులో అంజలి నటించడానికి ఓకే చేసింది. కాంట్రవర్షియల్ ప్రాజెక్టులో ఎప్పుడు అంజలి చేయదు .. మరి ఎందుకు ఈ ప్రాజెక్టును ఓకే చేసింది అనేది మాత్రం తెలియడం లేదు . అంజలి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . మరికొందరు మాత్రం ఇలాంటివి చేస్తేనే ఇండస్ట్రీలో నీ పేరు ఇంకా మారుమ్రోగిపోతుంది అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి హీరోయిన్ అంజలి బిగ్ రిస్క్ చేస్తుందని చెప్పాలి. అయితే ఇలాంటి కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ లో నటించిన తర్వాత ఆమెపై నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఉండవు.. అది కూడా అంజలి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుంటుంది అంటున్నారు జనాలు..!!