వాట్.. ప్రభాస్ నటించిన ఆ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ను.. చరణ్ రిజెక్ట్ చేశాడా..?!

సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో.. ఏ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందో ఎవ్వరు చెప్పలేరు. సినిమాలో కంటెంట్ ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది తప్ప.. హై ఎక్స్పెక్టేషన్స్, హెవీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తే సినిమా సక్సెస్ అవుతుందనేది అవాస్తవం. అలాగే హీరోలు కూడా తాము ఎంచుకునే కథలను బట్టి సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్గా క్రేజ్‌ సంపాదించుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత‌ చరణ్ చాలా స్టోరీలను వింటున్నాడట. కానీ అందులో కొన్ని సినిమాలను మాత్రమే ఆయన ఫైనల్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియ‌న్‌ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయినట్లు తెలుస్తుంది. అది కూడా ప్రభాస్ నటించిన సక్సెస్ సాధించిన సినిమా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

आपको Ram Charan पसंद हैं! लेकिन क्‍या आपको ये पता है एक्‍टर की 5 फेवरेट  फिल्‍में कौन सी हैं? - list of ram charan most favourite films actor  recommends 4 indian films

ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమాను రిజెక్ట్ చేయడం వెనక స్టోరీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ప్రభాస్ గ‌తేడాది నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన సలార్‌ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీని మొదటి రాంచరణ్ తో చేయాలని ప్రశాంత్ నీల్ భావించాడట. దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మధ్యలో కొన్ని అనివార్య కారణాలతో రామ్ చరణ్ సినిమా నుంచి ఇష్టం లేకపోయినా తప్పుకోవాల్సి వచ్చిందట‌. తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా ప్రభాస్‌కు బాగా కలిసి వచ్చింది. వరుస ఫ్లాపుల‌ తర్వాత బ్లాక్ బస్టర్‌తో త్రో బ్యాక్ అయ్యాడు ప్రభాస్. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు.

Salaar (2023) - IMDb

అదే ఉత్సాహంలో ఇప్పుడు వరుస సినిమాలు లైన్‌లో పెట్టుకున్నా రెబల్ స్టార్. ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి రామ్ చరణ్ సలార్ సినిమాను మిస్ చేసుకోవడానికి మరో కారణం డైరెక్టర్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం.. మరికొన్ని రోజులు సినిమా కోసం డేట్స్ కావాలని శంకర్ చెప్పడంతో తను ఏం చేయలేక.. సలార్ సినిమా అవకాశాన్ని ఇష్టం లేకపోయినా రిజెక్ట్ చేశాడంటూ తెలుస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ సలార్‌ సినిమాను మిస్ చేసుకున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవ్వడంతో చరణ్‌ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చెరణ్‌ మొత్తానికి ఈ సినిమాను మిస్ చేసుకుని ఉండాల్సింది కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.