కామినేని కాదు..కొణిదెల కాదు..ఉపాసనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం అదేనా..?

ఉపాసన ..కామినేని ఇంటి ఆడపడుచు ..కొణిదల ఇంటి కోడలు .. ఈ విషయం అందరికీ తెలిసిందే ..చాలా మంది ఉపాసన ను పొగిడేస్తూ ఉంటారు. కొంతమంది ఉపాసనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం కామినేని ఫ్యామిలీ అని ..ఆ తర్వాత అత్తగారిల్లు కూడా పెద్ద బడా కుటుంబం కావడంతో సోషల్ మీడియాలో బాగా ఆమె పేరు ట్రెండ్ అవుతుందని చెప్పుకొస్తూ ఉంటారు. కానీ అది అబద్ధం అంటున్నారు ఉపాసన ఫాన్స్. ఉపాసనకి ఇంత క్రేజ్ రావడానికి కారణం అటు అమ్మగారి కుటుంబం ఇటు అత్తగారి కుటుంబం కాదు అంటూ చెప్పుకొస్తున్నారు.

ఉపాసనలోని మంచితనమే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేసింది అని నెగెటివిటీ అనేది లేకుండా తన పని తాను చూసుకో పోతూ ఎదుటివారికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటే ప్రతి ఒక్కరూ ఉపాసన అలాగే పాపులారిటీ దక్కించుకుంటారు అని చెప్పుకొస్తున్నారు . ఉపాసన ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందో మనకు తెలిసిందే. వేల కోట్ల ఆస్తికి వారసురాలు అయినా సరే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతుంది. మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలు అయినా కూడా చాలా సరదాగా అందరితో మూవ్ అవుతూ ఉంటుంది . అదే ఆమెకు ఉన్న బిగ్ బిగ్ ప్లస్ పాయింట్ అంటూ ఓ రేంజ్ లో ఉపాసన ను పొగిడేస్తున్నారు జనాలు.


రామ్ చరణ్ – ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే . ఉపాసన కంటే రామ్ చరణ్ రెండేళ్లు చిన్నవాడు . అయినా సరే ప్రేమకి కులం – మతం – వయసు అడ్డురాదు అంటూ ప్రూవ్ చేసింది ఈ జంట . అంతేకాదు పెళ్లయిన పదకండేళ్లకు ఒక పాపకు తల్లిదండ్రులయ్యారు రామ్ చరణ్ – ఉపాసన . క్లీన్ కారా వీళ్ల జీవితంలోకి వచ్చాక ప్రతిరోజు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు..!!