చిరంజీవి-సురేఖ మధ్య జరుగుతుంది అదే.. స్టార్ సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలిచే జంట చిరంజీవి – సురేఖ. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆదర్శ దంపతులనే చెప్పాలి. వీళ్ళని ఆదర్శంగా తీసుకున్న జంటలు ఎంతోమంది ఉన్నారు . చిన్న విషయాలకి గొడవ పడుతూ విడిపోతున్న స్టార్ కపుల్స్ వీళ్లని ఆదర్శంగా తీసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి అంటూ ఉంటారు జనాలు. కాగా స్టార్ సీనియర్ హీరోయిన్ చిరంజీవి సురేఖ దాంపత్య జీవితంపై చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి . సినిమా ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ రాధ అప్పటి కుర్రాళ్లను ఎలా టెంప్ట్ చేసిందో మనకు తెలిసిందే.

చిరంజీవి – రాధ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . యువత గుండెల్లో గూడు కట్టుకున్న దేవత ఈమె అని చెప్పాలి . మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు ఎవరైనా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతారు అంటే అది కచ్చితంగా రాధ అని చెప్పుకోవడంలో సందేహం లేదు . డాన్స్ అంటే ఇద్దరికీ పిచ్చే .. ఇద్దరు కూడా ఓ రేంజ్ లో ఊగిపోతు డాన్స్ చేసేవారు . కాగా రాధ తన కోస్టర్స్ పట్ల చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో రాధ చిరు- సురేఖల మధ్య అండర్స్టాండింగ్ గురించి బయట పెట్టింది .

“మెగాస్టార్ ఇంటికి నేను చాలా సార్లు వెళ్లాను ..వెళ్లిన ప్రతిసారి కూడా సురేఖ చాలా చాలా ఆప్యాయంగా చూసుకుంటుంది ..మంచిగా మర్యాదలు చేస్తుంది ..మనకి ఏం కావాలో దగ్గరుండి వండుతుంది ..అందరితో చాలా సరదాగా కలిసిపోతుంది.. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడం తనను చూసే నేర్చుకోవాలి.. చిరంజీవి నిజంగా లక్కీ ..సురేఖ లాంటి భారీ దొరికింది.. అందుకే ఇప్పటికీ వాళ్ళ దాంపత్య జీవితం చాలా మధురంగా సంతోషంగా ఉంటుంది” అంటూ చెప్పుకు వచ్చింది. దీనిపై నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు . చిరంజీవి సురేఖ జంట అందరికీ ఆదర్శప్రాయం అంటూ చెప్పుకొస్తున్నారు..!!