అభిమానుల కోరిక తీర్చబోతున్న డార్లింగ్ ప్రభాస్.. ఇక కాలర్ ఎగరేయండి రా ఫ్యాన్స్..!

డార్లింగ్ ప్రభాస్ కోట్లాదిమంది రెబల్ అభిమానుల కోరిక తీర్చబోతున్నాడా ..? అంటే ఎస్ అంటూ ఆన్సర్ వినిపిస్తుంది . పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్ళిపోతున్న ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ క్రేజీ హింట్ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి.

ఈ సినిమా విషయంలో సందీప్ రెడ్డివంగా అలాగే ప్రభాస్ చాలా చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కరీనాకపూర్ ..సారా అలీ ఖాన్ ..అలియా భట్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు బాగా ట్రెండ్ అయ్యాయి . కానీ ఫైనల్లీ రెబెల్ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని ఫైనలైజ్ చేసుకున్నారట మేకర్స్.

ఎప్పటినుంచో వీళ్ళ కాంబోలో సినిమా వస్తే చూడాలి అనేది రెబెల్ అభిమానుల కోరిక . ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరబోతుంది . ఈ సినిమాలో ప్రభాస్ – కీర్తి సురేష్ జంటగా కనిపించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. త్వరలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో దిశా పటాన్ని అలాగే దీపిక పదుకొనే హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమాపై హ్యూజ్ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెబల్ అభిమానులు..!!