మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతారా.. అసలు గెస్ చేయలేరు..?!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా సెలబ్రిటీస్ కొన్ని రకాల సెంటిమెంట్స్‌ను గట్టిగా న‌మ్ముతారు. వాటినే గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ సెంటిమెంట్స్ ఫాలో అవ్వడం వల్లే తమ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతూ ఉంటారట‌. అలా మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఎంతోమంది ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతారట‌. అయితే ఇంతకీ అలాంటి సెంటిమెంట్లు న‌మ్మి సినిమా తెర‌కెక్కించే మన తెలుగు సెలబ్రిటీస్ ఎవరు..? ఎలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతారు..? ఒకసారి చూద్దాం.

దాదాపు అన్ని సినిమాల్లో తండ్రి, కొడుకు పాత్రలో ఇద్దరు వేరువేరు వ్యక్తులు నటిస్తూ ఉంటారు. కానీ బాలయ్య బాబు మాత్రం ఆయ‌న సినిమాల్లో తానే తండ్రిగా, తానే కొడుకుగా నటిస్తూ ఉంటాడు. ఇది ఒక రకంగా బాలయ్య సెంటిమెంట్ గా భావిస్తాడట. అలా బాల‌య్య ఇప్ప‌టివ‌ర‌కు చాలా సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. అలాగే అక్కినేని నాగార్జున డిసెంబర్ మంత్‌ని చాలా సెంటిమెంట్ గా భావిస్తార‌ట‌. అందుకే ఎక్కువ శాతం ఆయన సినిమాలను డిసెంబర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు అని తెలుస్తుంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది నయనతార.

ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఇక టాలీవుడ్ లోనూ దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించిన న‌య‌న్‌.. ఇప్పటికి అదే పాపులారిటీతో కొన‌సాగుతుంది. ప్రస్తుతం సౌత్‌లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో నయనతార పేరే వినిపిస్తుంది. ఇక లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న నయన్‌ కూడా తన సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ బాగా ఫాలో అవుతుందట. ఆమె లక్కీ నెంబర్ 5 అని.. ఆమె నటించే అన్ని సినిమాలు దాదాపు 5వ తేదీ మొదలయ్యేలా ప్లాన్ చేసుకుంటుందని తెలుస్తుంది. అలాగే రెమ్యూనరేషన్ లో ఇచ్చే మొదటి అడ్వాన్స్ కూడా ఫైవ్ డిజిట్ లో వచ్చే విధంగా ఆమె తీసుకుంటుందట. దాన్ని కూడా ఆమె సెంటిమెంట్ గా భావిస్తుందట.