27 ఏళ్లకే కోట్లలో ఆస్తి కూడా పెట్టినా రష్మిక మందన.. నేషనల్ క్రష్ బిజినెస్ లెక్కలు చూస్తే నోరెళ్ళబెడతారు.. !!

మొదట కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది రష్మిక మందన. తర్వాత హలో సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. దాదాపు అగ్ర భాషలన్నింటిలోనూ స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్గా హిందీలో యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రూ.900 కోట్ల వరకు కలెక్షన్లు రాబ్బ‌టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నటించిన పుష్ప సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2లో ఆమె నటిస్తుంది. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే ఇక‌ ఆమెకు ఇండస్ట్రీలో తిరుగు ఉండదనేది వాస్త‌వం. అయితే 27 ఏళ్ల వయసులోనే రష్మిక మందన భారీ పాపులారిటీతో పాటు.. కోట్ల ఆస్తులు కూడబెట్టిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అతి చిన్న వయసులోనే కోటీశ్వరురాలిగా మారిన రష్మిక.. బెంగళూరు, కూర్గ్‌, గోవా, హైదరాబాద్, ముంబై ఇలా ఎన్నో నగరాలలో సొంత ఇళ్ళను కొనుగోలు చేసింది. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందట. ఇక సినిమాలో నటించడమే కాకుండా ఎన్నో వ్యాపారాల్లో కూడా తెలివిగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె తన సినిమాల్లో సంపాదించిన డబ్బులు.. తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుందని సోషల్ మీడియా సమాచారం.

తన ఆస్తుల తో పాటు సినిమాల్లో కూడా క్రేజ్‌ను పెంచుకుంటూ సంపాదన రెట్టింపు చేసుకుంటుంది ఈ నేషనల్ క్రష్. ఇక‌ ఇలా రష్మిక అతి చిన్న వయసులోనే మొత్తం రూ.70 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఈ వార్త‌లో వాస్త‌వం ఎంతో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో ఈ న్యూస్‌ తెగ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. పిట్ట కొంచెం కూత ఘ‌నం అంటే ఇదేనేమో.. చూడడానికి ఇన్నోసెంట్ గా కనిపించే ఈ చిన్నది.. ఇంత చిన్న ఏజ్ లోనే అన్ని కోట్లు కూడా పెట్టడం అంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇవే కాకుండా ఈమె గ్యారేజ్ లో ఎన్నో రకాల లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట.