“ఎవ్వరు హర్ట్ అయినా పర్లేదు..దేవర లో అది ఉండాల్సిందే”..టీమ్ కు ఎన్టీఆర్ ఆదేశం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ మూవీ టీం కు గట్టి వార్నింగ్ ఇచ్చాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దేవర సినిమాను తొక్కేయడానికి బ్యాక్ గ్రౌండ్ లో భారీ స్కెచ్ వేస్తున్నారు . ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమాను కొన్ని కారణాల చేత వాయిదా వేయించారు .

అటు ఇటుగా ఆ సినిమా ఇప్పుడు దసరాకి రిలీజ్ అయ్యే సిచువేషన్ తీసుకొచ్చేశారు. అక్టోబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు . పోనీలే అని సర్దుకునేశాడు ఎన్టీఆర్ . అయితే మే 20న అయిన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. అయితే కొన్ని కారణాల చేత ఇది రిలీజ్ చేయకుండా అడ్డుకుంటున్నారట కొంతమంది పెద్ద మనుషులు.

ఈ విషయంలో సీరియస్ గా హర్ట్ అయ్యాడట ఎన్టీఆర్ . “ఎవరు ఏమనుకున్నా ఎలాంటి కుట్రలు పన్నినా సరే మే 20న దేవర నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సిందే.. ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయాల్సిందే అంటూ తెగేసి చెప్పేసాడట . కొరటాల శివకు స్ట్రైట్ గానే ఆర్డర్స్ పాస్ చేశాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూద్దాం మరి మే 20న ఎలాంటి సాంగ్ రాబోతుందో..? దేవర సినిమాపై అయితే మాత్రం నందమూరి అభిమానులు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. కొరటాల శివ ఏం మాత్రం తేడా చేసిన జనాలు అస్సలు ఊరుకోరు..!!