ఆ యంగ్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ మూవీ కి ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ.. మరో అర్జున్ రెడ్డి పక్కా..!

ఇటీవలే ఖుషి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎనలేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వీటిల్లో ఫ్యామిలీ స్టార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా గౌతమ్ తీస్తున్న మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. విషయం ఏమిటంటే, ఈ రెండిటి అనంతరం ఇటీవల రాజా వారు రాణి గారు మూవీతో మంచి విజయం అందుకున్న రవి కిరణ్ కోలా తో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ సర్వేగంగా జరుగుతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో సాగే పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి తో మూవీ అయిన వెంటనే విజయ్ ఈ మూవీకి డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ని కూడా దిల్ రాజు నే గ్రాండ్గా నిర్మిస్తున్నాడట.