ఆ స్టార్ హీరో సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష.. పాప సినీ కెరీర్ కి మరికొన్నాళ్లు నో డోకా..!

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీని ఏలుతూ ఏ హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఇవ్వకుండా దూసుకుపోతున్న హీరోయిన్స్లో త్రిష కూడా ఒకరు. తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించి ప్రస్తుత కాలంలో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే లియో సినిమాతో ప్రేక్షకులే ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ‘విశ్వంభరా’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జతకట్టిన త్రిష, తాజాగా మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. తమిళ్ అగ్ర హీరో విజయ్ తాజా చిత్రం ‘ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ‘ ( గోట్)’ చిత్రంలో కథానాయికగా ఎంపికయింది. ఇక ఏ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.అలా యంగ్ విజయ్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా తండ్రి పాత్రకు జోడిగా త్రిష నటిస్తుంది. అయితే ముందు అనుష్క అనుకున్నారు.

కానీ ఆ పాత్రలకు స్వీటీ నో చెప్పటంతో చివరికి త్రిషకి దక్కింది. సాధారణంగా ఈ జంటకి కోలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలిసిందే. లియో సినిమాతో క్రేజీ కపుల్ గా పేరు సంపాదించుకున్న వీరిద్దరూ మరోసారి జతకట్టడంతో వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.