పుష్ప 2 అప్డేట్ కి టైం లాక్ చేసిన మేకర్స్.. మినిమం ఉంటుంది అంటున్న ఫ్యాన్స్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఒక ఆర్మీ ఫాలోయింగే సంపాదించుకున్నాడు. ఇక తాజాగా “పుష్ప1″ సినిమాతో ప్రేక్షకుల్ని బాగా మెప్పించాడు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న మూవీ ” పుష్ప 2 “. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసున రష్మిక మందన నటిస్తుంది.

రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న పుష్ప 2 నుండి ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ని టీమ్ ప్లాన్ చేస్తోందని వినికిడి.

దీనికి సంబంధించి త్వరలో పూర్తి డీటెయిల్స్ వెల్లడయ్యే అవకాశం ఉందట. ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్ అనసూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.