తారక్, ప్రభాస్, బన్నీ, పవన్ టాలీవుడ్ హీరోల అందరిని కాపీ చేసిన విజయ్.. మరి ఇంత దారుణమా దళపతి..?!

స్టార్ హీరో విజయ్‌ దళపతికి కోలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన విజయ్ సినిమాలు.. తెలుగులోనూ డ‌బ్ అయ్యి ఇక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్‌లోను విజయ్‌కి కొంతమేర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న విజయ్.. తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకే పరిమితమవుతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Thalapathy: దళపతి విజయ్ కాపీ కొట్టిన డ్యాన్స్ స్టెప్స్.. ప్రభాస్, బన్నీ, తారక్ సినిమాలోవే! (వీడియో)-thalapathy vijay copied dance steps from telugu heroes trolling like prabhas ...

అయితే గతంలో విజయ్ నటించిన ఎన్నో సినిమాలలో తార‌క్‌, ప్రభాస్, బ‌న్నీ, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ స్టెప్స్ ను కాపీ కొట్టడంటూ వార్తలు వైరల్ గా మారాయి. ప్రభాస్ బిల్లా, చిరంజీవి ఇంద్ర, యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ, అల్లు అర్జున్ ఆర్య 2, వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు, పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలా ఎన్నో సినిమాల్లోని స్టెప్స్ ను విజయ తన సినిమాలకు కాపీ చేసి వాడుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి సరిపడగా ప్రూఫ్స్ ని కూడా షేర్ చేస్తూ తెలుగు హీరోల ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ ద‌ళపతి ఎన్నో తెలుగు సినిమాల రీమేక్ సినిమాల్లో నటించి భారీపాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Thalapathy Vijay dance copy steps troll🤣😜 - YouTube

అయితే ప్రస్తుతం డ్యాన్స్ స్టెప్పులు కూడా కాపీ కొట్టిన వీడియోస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఛి ఛి మరీ ఇంత దారుణమా.. డ్యాన్స్ స్టెప్స్ కూడా కాపీ కొట్టడమేనా అంటూ.. కాపీ పేస్ట్ రిపీట్ అంటూ విజయ్ పై ఫైర్ అవుతున్నారు. అయితే అందులో విజయ్ తప్పు ఏముంది.. కాపీ కొట్టి విజయ్ తో చేపించిన డ్యాన్స్ మాస్టార్ల తప్ప‌ది అంటూ విజయ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ వెంకట ప్ర‌భు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెర‌క‌ట ప్రభు చివరిగా తెర‌కెక్కించిన కస్టడీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆయన గత ట్రాక్ రికార్డులతో సంబంధం లేకుండా వెంకట ప్రభుకి వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక సినిమా సినిమాకు విజయ్ మార్కెట్‌ను రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్‌ రెమ్యునరేషన్ రూ.150 కోట్లకు పై చిలుకే ఉంటుందని సమాచారం. స్టార్ హీరో విజయ్ కథల ఎంపిక విషయంలో కూడా ఆచితిచి అడుగులు వేస్తారట.