వాట్.. బిగ్ బాస్ అమర్, సురేఖ వాణిల మధ్య అలాంటి రిలేషన్ ఉందా.. సుప్రీతకు మూవీ ఛాన్స్ రావడానికి కారణం అదేనా..?!

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు,బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ సీజన్‌7 లోపాల్గొని రన్నరప్ గా నిలిచిన‌ అమర్ ఈ షోలో పాల్గొన‌క ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు అమ‌ర్‌. ఇది ఇలా ఉంటే అమర్ బిబి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకా హీరోగా ఓ మూవీ ఛాన్స్ కొట్టేసాడు. అ మూవీ షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమం జ‌రిగిన పిక్స్ నెటింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ సినిమాలో అమర్‌దీప్‌కి జంటగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

Surekha Vani Amardeep: అమర్ నాకు తమ్ముడు లాంటోడు... కూతురు సినీ ఎంట్రీ పై  సురేఖవాణి కామెంట్స్ - Actress Surekha Vani Interesting Comments On Bigg  Boss Amar Deep

ఇక సురేఖా వాణి గత కొంత కాలంగా తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. అమర్ దీప్ సినిమాతో ఆమె కోరిక నెర‌వేరింది. అయితే అమర్ దీప్ తన సినిమాలో సుప్రీతకు ఛాన్స్ ఇవ్వడనాకి వెనుక ఓ ఆశ‌క్తిక‌ర కారణం దాగుంద‌ట‌. ముఖ్యంగా సురేఖావాణితో.. అమర్ దీప్ కి మ‌ధ్య ఉన్న‌ రిలేషన్ సుప్రిత‌కు ఈ ఛాన్స్ రావ‌డానికి కార‌ణం అని తెలుస్తుంది. ఇక తాజాగా అమర్ – సుప్రీత దావత్ అనే టాక్ షోలో పాల్గొన్నారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా ఉన్న ఈ షోలో యంగ్ జోడి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్ష‌కుల‌తో షేర్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో నటి సురేఖావాణితో తనకున్న బంధం రివీల్ చేశాడు. అమర్ దీప్‌ కి సురేఖావాణి దూర‌పు బంధువు అవుతుంద‌ట.

ఆమె వరసకు అక్క అవుతుందని.. ఇక సుప్రీతకు నేను మేనమామ అవుతాను అంటూ అమర్ దీప్ వివ‌రించాడు. దాంతో హోస్ట్ రీతూ చౌదరి.. అమర్ దీప్ ని మామయ్య అని పిలవాలని సుప్రీతను అడిగింది. మామయ్యా అంటూ సుప్రీత క్యూట్ గా అమ‌ర్‌ను పిలిచింది. దీంతో అమర్ సిగ్గు మెగ్గ‌లేసాడు. అలాగే తన సినిమాలో సుప్రీతను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏంటో అమర్ వివ‌రించాడు. ఆ పాత్రకు సుప్రీత అయితే క‌రెక్ట్‌గా సూట్ అవుతుందనీ.. అందుకే సెల‌క్ట్ చేసుకునట్లు వెల్ల‌డించాడు. ఇక ఈ సినిమా వలన తన కాలేజీ డేస్ గుర్తుకు వస్తున్నాయ‌ని వివ‌రించాడు.