ప్రపంచం మొత్తాన్ని తన డ్రెస్ లో చుట్టేసిన ఊర్ఫీ.. ఈ వింత డ్రెస్‌ భలే ఉందే( వీడియో)..

హిందీ బిగ్ బాస్ బ్యూటీ ఊర్ఫి జావిద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె పేరు ఎత్త‌గానే మనకు త‌న‌ విచిత్ర వేషధారణ గుర్తుకు వస్తుంది. డిఫరెంట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ.. విచిత్ర వేషధారణలో ఎప్పటికప్పుడు నెటింట వైరల్‌గా మారుతూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్‌ని కూడా ఈమె అప్పుడప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి చాలా వరకు ఈమె సుపరిచితమే.

Big Boss star in glamourous sack outfit, new experiment goes viral, see video - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

నిత్యం తన హాట్ ఫోటోషూట్లతో వార్తల్లో వైరల్ గా మారే ఊర్ఫీ జావిద్.. ఎన్నో కామెంట్స్.. ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే అవేమీ పట్టించుకోకుండా తన స్టైల్ లో తను దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఊర్ఫి జావిద్ ఎప్పటిలాగే మరో విచిత్రమైన వేషధారణతో వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఏకంగా తన డ్రెస్ లో విశ్వం మొత్తాన్ని డిస్‌ప్లే చేసేసింది. డ్రెస్ లో యూనివ‌ర్స్‌ డిస్‌ప్లే చేయడం ఏంటి.. అనుకుంటున్నారా కానీ ఇదే నిజం.

సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన హిప్ చుట్టూ తిరిగేలా డ్రస్సు డిజైన్ చేయించుకుంది. ఇక ఆ డ్రస్ ధరించి ముంబై వీధుల్లోకి వచ్చిన ఊర్ఫిని చూసిన ప్రజలంతా షాక్ అవుతున్నారు. వావ్.. ఈ డ్రెస్ భలే వింతగా ఉందే అంటూ.. విశ్వాం మ‌న‌ చుట్టూ తిర‌గాలంటే ఇలా కూడా చేయొచ్చా అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. మీరు ఓ లుక్ వేసేయండీ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)