క్లీంకారకు బీచ్ అందాలు పరిచయం చేసిన చరణ్.. ఫొటోస్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీ హీరోగా మారిపోయాడు. వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టుకుంటున్న చ‌ర‌ణ్‌.. ఇటీవల ఫ్యామిలీ మొత్తం తో కలిసి వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేశారు. తన కూతురు క్లిం కారా, భార్య ఉపాసనతో కలిసి బీచ్ ఎన్విరాన్మెంట్ను సరదాగా గడిపారు. తాజాగా చెర్రీ తన కూతురుతో రిలాక్స్ అవుతూ ఉన్న ఫొటోస్.. ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. చ‌ర‌ణ్ – ఉపాస‌న‌ దంపతులు పెళ్లయిన 10 ఏళ్లకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ పాపకు క్లీంకార అనే పేరు పెట్టారు. క్లీంకారను.. రామ్ చరణ్ దంపతులు ఎంతో అపురూపంగా.. జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆమె కోసం స్పెషల్ రూమ్‌ని కూడా రూపొందించారు.

పాప పుట్టిన తర్వాత త‌న‌ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు చ‌ర‌ణ్‌. ఎక్కడికి వెళ్లినా క్లింకారా వారి వెంట ఉండాల్సిందే. దీంతో ఇప్పటికే కూతురితో పాటు ఎన్నో దేశాల్లో విమ‌రించాడు చరణ్. ఇక క్లింకార ఫోటోలు మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. దీంతో రామ్‌చరణ్ వారసురాలు ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మొదటిసారి క్లింకార ఫోటోలు కాస్త రివిల్ అయ్యాయి. రామ్ చరణ్ – ఉపాసన విశాఖ బీచ్ లో కూతురుతో సరదాగా గడుపుతున్న నేపథ్యంలో దిగిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

అయితే ఈ ఫొటోస్ లో కూడా క్లీం కార మొఖం క్లియర్ గా కనిపించడం లేదు. గతంలో పోలిస్తే లు కాస్త మేరకు రిపీల్ అయింది. తాజాగా గేమ్ చేంజర్‌ షూటింగ్ కోసం వైజాగ్ లో సందడి చేసిన రామ్ చరణ్.. అక్కడే షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక క్లింకార ని తీసుకుని ఉపాసన కూడా వైజాగ్ వెళ్ళింది. సాయంత్రం వేళ బీచ్‌లో సేద తీరుతూ సరదాగా గడిపారు. ఇక చరణ్ మొత్తం స్కెడ్యూలంతా పూర్తయ్యే వరకు వైజాగ్‌లోనే ఉంటాడు. కాగా డైరెక్టర్ శంకర్ పొలిటికల్ ధ్రిల‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ గేమ్ చేంజర్‌ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్లో సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. ఇక రాంచరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను బుచ్చిబాబు సనాతో చేస్తున్న సంగతి తెలిసిందే.