“గ్లాస్ పగిలే కొద్దీ ప‌దునెక్కుద్ది” పవర్ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ( వీడియో)..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న మూవీలలో ఉస్తాద్‌ భగత్ సింగ్ ఒకటి. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత. మ‌రోసారి పవన్ – హరీష్ కాంబోలో వస్తున్న మాస్‌ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి.

Power Star's Ustaad Bhagat Singh's first glimpse on that day? - TeluguBulletin.com

తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేశారు. పవర్ఫుల్ అండ్ యాక్షన్ మోడ్లో ఉన్న ఈ గ్లింప్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏపి ఎల‌క్ష‌న్ నేప‌ధ్యంలో గ్లింప్స్‌లో పవన్ చెప్పిన పొలిటికల్ డైలాగ్స్ సినిమాపై హైప్‌ మరింత పెంచేస్తున్నాయి. విలన్ నీ రేంజ్ ఇది అంటూ గాజు గ్లాస్ పగలగొడతాడు.. దానికి కౌంటర్ గా పవన్ గాజు పగిలే కొద్దీ పదునెకుద్ది.. కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవర్ఫుల్ పంచ్ డైలాగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతుంది.

 

మాస్ ఆడియన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్, జ‌న‌ సైనికులను ఈ డైలాగ్ బాగ న‌చ్చేయ‌డంతో దాని మ‌రింత వైర‌ల్ చేస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో కావాలనే ఈ పొలిటికల్ హీట్ పెంచే గ్లింస్ ను మేకర్స్ రిలీజ్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ గ్లింప్స్‌తో పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడడం హ్యాపీగా ఉందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.