ఒక్క హిట్ తో ‘ కల్కి 2898 ఏడీ ‘ లో నటించే ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. లక్‌ అంటే ఇదే..

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ నాగ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న మూవీ ‘ కల్కి 2898 ఏడి ‘. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పఠాని లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా కల్కి ప్రాజెక్ట్ లోకి మరో టాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్లు న్యూస్ నెటింట వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో కాదు.. ఇటీవల రిలీజైన హనుమాన్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించిన తేజ సజ్జా. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ లో తేజ.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారింది. దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో నిర్మాత సి. అశ్విని దత్‌తో.. తేజ కలిసి కనిపించడమే ఈ వార్తలు వైరల్ అవ్వడానికి కారణం. అంతే కాదు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ తను చేయాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని.. విషయం చెప్పడానికి సరైన క్షణం కోసం ఎదురుచూస్తున్నానంటూ వివరించాడు. దీంతో కచ్చితంగా ప్రభాస్ కల్కి లోనే తేజ నటిస్తున్నాడంటూ వార్తలు జోరు అందుకున్నాయి.

ఇక ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే. ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించాడు. ఈ మూవీ స్టోరీ మహాభారత కాలం నుంచి మొదలై 2898 సంవత్సరంతో పూర్తవుతుందట. గతంలో ప్రారంభమై భవిష్యత్తులో ముగుస్తుంది తాజాగా జష్ట్ ఏ వామప్ అనే క్యాప్షన్ తో మేకర్స్ ఓ షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు.. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలనుకున్నాయి. ఇక తేజకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలియడంతో లక్కీ ఛాన్స్ కొట్టేసావు కదా బ్రో.. ఒక్క హిట్ తో.. ప్రభాస్ సినిమా అది కూడా భారీతారాగణం అంతా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో ఆఫర్ అంటే ఇక నీ దశతిరిగినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.