బాబు బాబు అంటూ పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి .. పోరంబోకు పనులు చేస్తున్న పెద్ద మనిషి..!?

ఎక్కడ మంచి ఉంటే అక్కడ చెడు ఉంటుంది అని.. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . అది నిజమే ..అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నో ఫేస్ చేసి ఉంటాం. మనం కెరియర్ లో ఎదుగుతూ ఉంటే మనల్ని లాగేసే వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఆ విషయం మనకు తెలియదు కానీ చేతులు కాలాక మాత్రం మనం ఈజీగా గుర్తుపట్టేస్రాం. అలాంటి సిచువేషన్ పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో ఎన్నో ఫేస్ చేశాడట . దానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ ..మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు .

ఇప్పుడు వేల కోట్ల అభిమానుల మనసులను కొల్లగొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించాల్సి ఉండిందట . ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా చాలా ఇష్టంగా వెయిట్ చేశారట . కానీ ఆయన పక్కనే ఉంటూ పెద్ద మనిషిల బిహేవ్ చేసే ఓ వ్యక్తి ఆ సినిమాను పవన్ కళ్యాణ్ చేయినికుండా చెడగొట్టారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది .

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా ఆనంద్. ఈ సినిమాలో మొదటగా హీరోగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట. శేఖర్ కమ్ముల కథ వివరించగా పవన్ కూడా ఓకే చేశారట . కానీ పవన్ పక్కనే బాబు బాబు అంటూ ఆయనను పొగిడేసే ఓ పెద్దమనిషి … ఈ సినిమా చేస్తే నువ్వు క్లాస్ హీరో అవుతావు కానీ .. మాస్ ఇమేజ్ రాదు అంటూ లేనిపోనివి కలగలిపి చెప్పి ఈ సినిమాను రిజెక్ట్ చేసేలా చేసాడట .

ఆ తర్వాత ఈ సినిమా వేరే హీరో చేతిలోకి వెళ్లి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన మనకు తెలిసిందే. కేవలం ఈ సినిమా మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఖాతాలో పడాల్సిన ఎన్నో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను సైతం ఈ పెద్దమనిషి కొన్ని పోరంబోకు పనులు చేసి చేతులు మార్చేసాడట . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!!