దివి కోసం అలాంటి పని చేసిన రష్మిక మందన్నా.. ఎంత పెద్ద త్యాగం చేసిందో..!

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. రష్మిక మందన్నా.. దివి కోసం అలాంటి పని చేసిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . బిగ్ బాస్ ఫేం దివి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంది. హీరోయిన్ అయిపోదామని ఇండస్ట్రీలోకి వచ్చిన దివి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు మహర్షి , ఏ వన్ ఎక్స్ప్రెస్ సినిమాల్లో నటించింది . బిగ్బాస్ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దివి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో మెలిసింది .

కాగా ప్రస్తుతం హీరోయిన్గా “లంబసంగి” అనే సినిమాలో నటిస్తుంది . ఇది ఓ లవ్ స్టోరీగా రాబోతుంది . సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమా డైరెక్టర్ ఈ సినిమాతో నిర్మాతగా మారిపోతున్నాడు . నవీన్ గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ హీరోగా పరిచయం అవుతున్నాడు . కాగా ఈ సినిమా కోసం రష్మికను రంగంలోకి దింపింది అందాల ముద్దుగుమ్మ దివి.

రష్మిక రష్మిక నటిస్తున్న పుష్ప2లో కీలకపాత్రలో కనిపిస్తున్న దివి షూటింగ్లో కలిసినప్పుడు లంబసంగి గురించి చెప్పిందట. అంతే ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయడానికి రష్మిక ఓకే చెప్పేందట. ఈ సినిమాను చాలా కష్టపడి తెరకెక్కిస్తున్న ఎంతో హార్డ్ వర్క్ కూడా చేశాం . ఈ సినిమాని ప్రమోట్ చేయండి అంటూ దీవి రష్మిక ను కోరిందట. అంతేకాదు దివి చెప్పకపోయినా సరే ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తాను అంటూ రష్మిక ఈ మూవీకి బెస్ట్ విషెస్ అందించింది . ఎందుకంటే ఈ మూవీ కోసం టీ మొత్తం అంత కష్టపడ్డారు అంటూ చెప్పుకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రష్మిక ఎంత బిజీగా ఉంటుందో మనకు తెలిసిందే. మరి అలాంటి ముద్దుగుమ్మ ఒక చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి టైం తీసుకుని మరి వీడియో రికార్డ్ చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు జనాలు . ఈ సినిమా ఖచ్చితంగా చూస్తామంటూ రష్మిక ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు..!!