“ఫైనల్లీ..నా కోరిక తీరింది”.. మెగా ఫ్యాన్స్ కి ఉపాసన తీపి కబురు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ భార్య నే ఈ ఉపాసన . అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలిగా అందరికీ సుపరిచితురాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఓ మంచి హ్యూమన్ బీయింగ్ . ఉపాసనలో ఉండే మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రీసెంట్గా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకున్న పోస్ట్ అభిమానులకి ఎంతో హ్యాపీనెస్ ని క్రియేట్ చేసిందో..

అంతేకాదు ఆమె కూడా నేను ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను అంటూ చెప్పుకొచ్చింది . ఉపాసన ఇటీవల తన కుటుంబంతో బాల రాముని దర్శించుకునింది. తన తాత – నానమ్మ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య బాల రాముని భక్తిశ్రద్ధలతో దర్శించుకునింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేస్తూ..” నా కోరిక తీరింది.. ఒక కల నెరవేరి పోయింది .. ఇది నా జీవితంలో మర్చిపోలేని ప్రయాణం ..ఓ అద్భుతమైన అనుభూతినిచ్చింది ” అంటూ రాసుకొచ్చింది.

ఇది చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు . ఉపాసన తన కూతురు క్లింకారాను చూసుకుంటూ మరోవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను చూసుకుంటూ .. ఇంకొక వైపు రామ్ చరణ్ బాగోగులు చూసుకుంటూ .. రియల్ ఉమన్ గా ఓ తల్లిగా.. ఓ భార్యగా.. ఓ మనవరాలిగా అన్ని బాధ్యతలు చక్కగా నెరవేరుస్తుంది అని.. ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు. కాగా రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఉపాసన తాను రెండో బిడ్డను కనడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన ప్రకటన చేసింది..!!