ఈసారి అల్లు అర్జున్ బర్త డే అద్దిరిపోయే సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే స్టార్ హీరో బర్త్డ డే కి గాని.. వాళ్లకు సంబంధించిన స్పెషల్ డే వస్తుంది అంటే వాళ్ళు నటించే సినిమాలకు సంబంధించిన.. టీజర్ .. ట్రైలర్.. ఫస్ట్ సింగిల్ లేకపోతే ఫస్ట్ లుక్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ మధ్యకాలంలో అది ట్రెండ్ లా మారిపోయింది . అయితే ఇప్పుడు బన్నీ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ అప్డేట్ కోసమే ..

ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే .. కచ్చితంగా ఆ రోజు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న పుష్ప2 గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు . కానీ సుకుమార్ ఇంతటి పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . పుష్ప 2 నుంచి సరైన అప్డేట్స్ రావట్లేదు అంటూ ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్న ఫ్యాన్స్ కు ఎగిరి గంతేసే పూనకాలు తెప్పించే మేటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట . ఓ చిన్న టీజర్ లేకపోతే ఫస్ట్ సింగిల్ కాదు కచ్చితంగా పుష్ప2 హై రేంజ్ క్రియేట్ చేసే ఆలోచనలోనే ఓ బిగ్ బడా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బన్నీ నటించబోయే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ 8వ తేదీ రాబోతున్న అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు..!!