అది ప్రూవ్ చేయడానికి నిహారిక కావాలనే చైతన్యను రెచ్చకొడుతుందా..? మెగా డాటర్ తెలివితేటలు మామూలుగా లేవుగా..!

నిహారిక .. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా అందరికీ సుపరిచితురాలు . యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా తన లక్ ని పరీక్షించుకున్న నిహారిక చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకునే ఉంటుంది. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి . దీంతో ఇలా కాదు అనుకొని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది . అది కూడా సర్వనాశనం అయిపోయింది . జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి చేసుకున్న నిహారిక పెళ్లైన అతి తక్కువ కాలానికి విడాకులు తీసేసుకుంది .

 

ఇప్పుడు సింగిల్ గా లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్ ఇంటర్వ్యూస్ లో నిహారిక తన మాజీ భర్త చైతన్య పై తన డివర్స్ పై పరోక్షకంగా ఘాటుగా కౌంటర్స్ వేస్తూ వచ్చింది. దీంతో ఇన్నాళ్లు చూసి చూడనట్లు సైలెంట్ గా ఉన్న చైతన్య ..ఇప్పుడు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు . మొన్నటికి మొన్న సైలెన్స్ సైలెన్స్ అంటూ పెద్ద పోస్టునే పెట్టుకొచ్చాడు . నేడు ఏకంగా పాజిటివిటీని పెంచాలి అనుకుంటున్నాను అంటూ పరోక్షంగా నిహారిక కు రాడ్ దింపేశాడు .

అయితే నిహారిక ఎందుకు పదేపదే చైతన్యను పరోక్షంగా గెలుకుతుంది అంటే మాత్రం విడాకుల విషయంలో ఆయనదే ప్రధాన తప్పు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . పైకి కనిపించే అంత మంచివాడు చైతన్య కాదు అని ప్రూవ్ చేయడానికి నిహారిక పరోక్షంగా ఆయనను రెచ్చగొడుతుందట . ఆ కారణంగానే పలు ఇంటర్వ్యూలలో ఇలాంటి మాటలు మాట్లాడుతుందట . గతంలో ఓ ఇంటర్వ్యూలో ..”అందరూ మన అమ్మానాన్నల ప్రేమించలేరు ..ఆ విషయాన్ని మనం ముందుగానే గుర్తించుకోవడం బెటర్” అంటూ సంచలన స్టేట్మెంట్ పాస్ చేసింది..!!