రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన స్టార్ బ్యూటీ.. సహాయం కోరిన హీరోయిన్..?!

సౌత్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి స్కూటీ పై ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా తీవ్ర ప్రమాదం జరిగింది. ఒక కారు వేగంగా వచ్చి ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో.. అరుంధతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇద్దరిని తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హాస్పటల్లో చేర్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అరుంధతికి ఐసియులో చికిత్స జరుగుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమె వైద్యానికి సహాయం కోరుతూ తన కో యాక్ట‌ర్‌ గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసుకుంది.

రోడ్డు ప్రమాదానికి గురైన అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉందని.. ఆమెకు ఐసియులో చికిత్స చేస్తున్నారని వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని.. మేము చేయగలిగిన హెల్ప్ చేస్తున్నామని వివరించింది. అయితే వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదని.. దయచేసి మీ వంతు ఆర్థిక సహాయం చేయండి.. ఆ సహాయం అరుంధతికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సహకరిస్తుంది అంటూ ఆమె ఆ పోస్ట్ లో వివరించింది. అందులో అరుంధతి బ్యాంక్‌ వివరాలు, గూగుల్ పే నెంబర్ ఆమె షేర్ చేసుకుంది.

అరుంధతి 2014లో పొంగు ఏజ్వ, మనోహర అనే తమిళ్ సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఐరన్ పోరుకాసుకల్ అనే సినిమాతో ఆమె ప్రేక్షకులను మెప్పించింది. అలాగే 2021 లో పద్మిని, డోంట్ థింక్ అనే రెండు వెబ్ సిరీస్ లలో కనిపించింది. ప్రస్తుతం అరుంధతి ఐసీయూలో విషమ పరిస్థితిలో ఉందని తెలియడంతో ఫ్యాన్స్ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆమె తంవ‌ర‌గా కోల్కోవాల‌ని ప్రార్ధిస్తున్నారు. ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని ఈ పోస్ట్ ను మరింత వైరల్ చేస్తున్నారు.