తారక్ లో జక్కన్న కి బాగా నచ్చిన విషయం ఇదే.. అందుకే అన్ని సినిమాలు తీశాడట..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు బాగా సెట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని కాంబోలో కోసం జనాలు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబో నే జూనియర్ ఎన్టీఆర్ – జక్కన్న . వీళ్ళ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు అన్నీ కూడా చరిత్రను తిరగరాశాయి . సినిమా ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేని రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి .

వీళ్ళ కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి ,ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తోనే ఇప్పటివరకు జక్కన్న ఎక్కువ సినిమాలను తెరకెక్కించడం గమనార్హం . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జక్కన్న తారక్ లో ఉన్న మంచి క్వాలిటీ గురించి ఆయనకు నచ్చిన బిగ్ క్వాలిటీ గురించి బయట పెట్టారు.

“నెగిటివ్ షేడ్స్ అనేటివి అస్సలు ఉండవు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు .. ఒక సినిమా ఒక డైరెక్టర్ వల్ల ఫ్లాప్ అయిందని తెలిసిన సరే ..ఆ డైరెక్టర్ ని బ్లేమ్ చేయడు..అది చాలా చాలా మంచి గుణం . అదే తారక్ లో నాకు నచ్చిన ది బెస్ట్ క్వాలిటీ” అంటూ ఇంటర్వ్యూలో రాజమౌళి – తారక్ ను ఓ రేంజ్ లో పొగిడేసారు . దానికి సంబంధించిన న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు .

ప్రజెంట్ రాజమౌళి – మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచర్స్ మూవీ ని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఈ సినిమా విషయంలో తారక్ తీసుకునే డెసీషన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిస్తున్నాయి..!!