“టిల్లు స్క్వేర్” సినిమా మొత్తానికి దరిద్రం అంటే అదే.. తప్పు చేశావ్ రా డైరెక్టర్..!

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో సిద్దు జొన్నలగడ్డ – నేహా శెట్టి నటించిన డిజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు .

అయితే ప్లాన్ మొత్తం మారిపోయింది . సినిమా కామెడీ పరంగా బాగుంది ..బోల్డ్ కంటెంట్ కూడా బాగానే ఉంది .. కానీ చివరి లాస్ట్ 20 నిమిషాలలో కామెడీని కాస్త మిస్ ఫైర్ చేసుకున్నాడు డైరెక్టర్ అంటూ పలువురు వెటకారంగా కౌంటర్స్ చేస్తున్నారు . సరదాగా సాగిపోతున్న నవ్వుకునే సినిమాలో సడన్గా సస్పెన్స్ ఏంటి అని ఆ ధ్రిల్లింగ్ సీన్స్ ఎందుకు పెట్టారు అని అక్కడే సినిమా చెడదొబ్బారు అని క్లైమాక్స్ సినిమాకి పరమ చెత్తగా ఉంది అంటూ ఓనెటిజన్ కామెంట్ చేశాడు .

అంతే కాదు ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సిద్దు జొన్నలగడ్డ అయితే బిగ్ మైనస్ పాయింట్ అనుపమ పరమేశ్వరణ్. అనుపమ పరమేశ్వరణ్ ని ఈ సినిమాలో పెట్టకుండా ఉండాల్సింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ మధ్య టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో ముందుకు వెళుతుంది. చూద్దాం మరి ఫస్ట్ డే ఎటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో ఈ సినిమా..??