ఎన్టీఆర్ డూప్ లేకుండా చేసిన ఒక్కే ఒక్క సినిమా ఇదే.. గట్స్ ఉన్న మగాడు వీడే రా బాబు..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కి డూప్స్ నటిస్తారు అన్న విషయం తెలిసిందే. మన ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్క స్టార్ హీరోకి తమకు తగ్గ రేంజ్ లో డూప్ ఉంటారు . అయితే చాలామంది డూప్స్ లేకుండా నటించడానికి ఇష్టపడినప్పటికీ స్టార్ హీరోల సెక్యూరిటీ కారణంగా కొన్ని సన్నివేశాలలో కచ్చితంగా డూప్స్ పెట్టుకుంటారు మేకర్స్ .

అయితే కొన్ని కొన్ని సందర్భాలలో హీరోస్ డూప్స్ లేకుండా నటించడానికి రిస్కు చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఎన్టీఆర్ అలాంటి ఓ పెద్ద రిస్క్ చేస్తున్నాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తారక్ బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో కూడా నటించడానికి ఓకే చేశారు. ఈ సినిమా మొత్తం భారీ భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట .

అయితే ఫస్ట్ టైం కెరియర్లో ఎన్టీఆర్ డూప్స్ లేకుండా భారీ యాక్షన్ సీన్స్ స్టంట్స్ ఈ సినిమా కోసం చేయబోతున్నాడట . దీంతో ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో డూప్స్ లేకుండా స్ట్రైట్ గా నటించబోతూ ఉండడం గమనార్ధం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 100 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా ఒక కి మైల్ స్టోన్ గా ఉండబోతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కష్టపడుతున్న విధానం చూస్తుంటే సినిమా చరిత్ర తిరగ రాయడం పక్క అంటున్నారు నందమూరి అభిమానులు..!!