“నాగచైతన్య సినిమాలో నేను నటించను” అంటూ తెగేసి చెప్పేసిన స్టార్ హీరో కూతురు.. ఎందుకంటే..?

నాగచైతన్య ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా ట్రై చేస్తున్న హీరో . నాగచైతన్య తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్న నాగచైతన్య ..ప్రజెంట్ తండేల్ సినిమా మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు .

 

ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది. రెండవ హీరోయిన్గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే నాగచైతన్యకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నాగచైతన్యతో నేను నటించను అంటూ తెగేసి చెప్పిందట . ఒక స్టార్ హీరో కూతురు..ఆమె మరి ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్.

ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ షేడ్స్ పాత్రలో నటిస్తూ వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . గతంలో నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో ఆమెను విలన్ షేడ్స్ పాత్ర కోసం అడిగారట . అయితే సమంతకి జాన్ జిగిడి దోస్త్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ .. నాగచైతన్యతో నటించిన అంటూ మొహమాటం లేకుండా చెప్పేసిందట. దీంతో వెంకట్ ప్రభు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఆమెను ఈ పాత్ర నుంచి తప్పించేసారట. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.