నాని స్టార్ హీరో అయ్యాక చాలా మారాడు.. గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తికే అవ‌కాశం ఇవ్వ‌లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రజాకర్ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెటింట తెగ వైర‌ల్‌గా మారింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులంతా పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమా టీమ్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఇప్పటి దర్శకుడు కాదు. దర్శకేంద్రుడు. కే.రాఘవేంద్రరావు దగ్గర కో డైరెక్టర్ గా పని చేసిన సత్యనారాయణ ఎన్నో సినిమాల కు అసిస్టెంట్ గా వ్యవహరించాడు.

అయితే ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ దర్శకత్వం వహించాడు. స్వర్ణ ఖడ్గం,మ‌నోయ‌ఙం, త్రిశూలం లాంటి సీరియల్స్ డైరెక్ట్ చేసిన ఈయన నితిన్ హీరోగా నటించిన అల్లరి బుల్లోడు సినిమాకు కో డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పటి హీరో నాని కూడా ఆ సినిమాకు పని చేశాడు. ఆ టైంలో సత్యనారాయణకు అసిస్టెంట్ గా నాని వ్యవహరించారు. ఆ తర్వాత నాని హీరో అయ్యాక సత్యనారాయణతో మాట్లాడటం మానేసాడని.. అష్ట చమ్మతో హీరోగా లాంచ్ అయిన నాని కనీసం ఆయనకు మాట కూడా చెప్పలేదని వివరించాడు స‌త్య‌నారాయ‌ణ‌.

పేపర్లో చూసి ఫోన్ చేస్తే మాట్లాడాడని.. అయితే స్టార్ అయ్యాక అసలు మాట్లాడడమే పూర్తిగా మానేసాడు అంటూ వివరించాడు. బాపు గారి కో – డైరెక్టర్ శ్రీనివాస్ గారిని నాని తన గాడ్ ఫాదర్‌లా చూసేవాడని.. అలాంటి ఆయనకు కూడా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఇలా స్టార్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు నాని అంటూ యాటా సత్యనారాయణ చేసిన కామెంట్స్‌కు నాని ఏ విధంగా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.