‘ విశ్వంభర ‘ తో హిట్ కొడితే.. వశిష్ట నెక్స్ట్ మూవీ హీరో ఆ పాన్ ఇండియన్ స్టారే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది తమ‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకుంటూ స‌క్స‌స్ సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. దానికోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తార‌న్న‌ సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు స్టార్స్ అంతా పాన్ ఇండియా హీరోలుగా మారాల‌ని ఆశ ప‌డుతున్నారు. టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పడాలంటే ఎలాగైనా సరే ఆ లెవెల్ లో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలని ప్రతి ఒక్క నటుడు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా అందరు పాన్‌ ఇండియా లెవెల్ లో సినిమాలు చేసేందుకు మ‌గ్గుచూపుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌లో విశ్వంభ‌ర తెర‌కెక్కుతుంది. ఈ మూవీతో చిరు తన సత్తాను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక చిరంజీవి చివరిగా నటించిన భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో ప్ర‌స్తుతం నటిస్తున్న విశ్వంభర సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట మెగాస్టార్. తానే దగ్గర ఉండి మరి సినిమాలో ప్రతి సీన్‌ను చిత్రీకరిస్తున్నాడట. ఇక వశిష్ట డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

ఏదేమైన‌ ఈ సినిమాతో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతాడని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడం ఖాయమని చెబుతున్నారు. ఇక ఇప్పటికే బింబిసారతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వ‌శిష్ట‌ మరోసారి ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటున్నడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వ‌శిష్ఠ‌ తన నెక్స్ట్ సినిమాను రామ్ చరణ్‌తో తీసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ కోసం సరిపడా స్క్రిప్ట్ ను కూడా ఆయన రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. చిరు విశ్వంభ‌ర తో సక్సెస్ కొడితే మాత్రం వశిష్ట నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో ఉండడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.