రవితేజ – సమంత కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ ..బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అలాంటి కాంబోలు కొన్ని సెట్ అవ్వవు ..సెట్ అయినా సరే సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబో నే రవితేజ – సమంత . వీళ్ళ కాంబోలో ఎన్నో సినిమాలు రావాలి కానీ రాకుండా ఆగిపోయాయి .

మాస్ హీరో- హీరోయిన్ సినిమాలో ఒక్క మూవీ పడి ఉన్నా కూడా అది చరిత్రను తిరగరాసే మూవీగా సాంగ్స్ హిట్ చేసి పెట్టుండేవారు. వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన మూవీ మరేంటో కాదు “బలుపు”. అంజలి – శృతిహాసన్ హీరోయిన్లుగా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ పాత్రలో ముందుగా సమంతను అనుకున్నారట మేకర్స్.

కానీ అప్పట్లో బిజీ షెడ్యూల్ కారణంగా సమంత ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఈ ప్రాత కోసం శృతిహాసన్ ను చూస్ చేసుకున్నారు మేకర్స్ . అంతేకాదు శృతిహాసన్ ఈ పాత్రలో బాగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలలో సమంతను హీరోయిన్గా అనుకున్న కొన్ని కారణాల చేత అది రిజెక్ట్ అయింది. అలా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన సినిమాలు మిస్ అయ్యాయి . ప్రెసెంట్ రవితేజ తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్లడానికి కొనసాగిస్తున్నాడు. హీరోయిన్ సమంత కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది..!!