ఒకప్పుడు హీరోయిన్..ఇప్పుడు అదే హీరోకు అక్క..భూమిక పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు రా సామీ..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటుందో ఎవ్వరు చెప్పలేం . అప్పటివరకు హీరోయిన్గా చేసిన హీరోయిన్.. పెళ్లి పిల్లలు పుట్టగానే ఆంటీ పాత్రలు చేయడానికి సిద్ధపడుతుంది . అఫ్ కోర్స్ డైరెక్టర్ హీరోయిన్ గా అవకాశాలు ఇస్తే ఆంటీ పాత్రలు ఏ హీరోయిన్ చేస్తారు..? అంటున్నారు జనాలు. పెళ్లయి పిల్లలు పుట్టాక బాడీ ఫిజిక్ లో మార్పు రావడంతో కొందరు డైరెక్టర్ లు స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఆంటీ పాత్రలు ఇస్తూ ఉంటారు .

భూమిక కూడా అదే సిచువేషన్ ఫేస్ చేసింది . ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన ఈ బ్యూటీ ఇప్పుడు హీరోలకి అక్క – అత్త పాత్రలో కనిపిస్తుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. దేవర సినిమాలో ఎన్టీఆర్కు అక్క పాత్రలో కనిపించబోతుందట భూమిక .

అఫ్ కోర్స్ ఎన్టీఆర్ కు చిన్నప్పటి పాత్రలో నటించే వ్యక్తికి అక్క కోసం నటించబోతున్న భూమిక పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు జనాలు . అప్పట్లో ఎన్టీఆర్ పక్కన సినిమాల్లో హీరోయిన్ గా నటించి నందమూరి అభిమానులను ఆకట్టుకునింది. ఇప్పుడు అదే హీరో సినిమాలో అక్క పాత్రలో కనిపించబోతుంది. టైం అంటే ఇదే అంటున్నారు జనాలు.
కేవలం భూమికనే కాదు చాలామంది హీరోయిన్స్ ఇలాగే తమ సెకండ్ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్తున్నారు..!!