ఒకే రోజు కాల్ చేసి మరి 17 సినిమాలను క్యాన్సల్ చేసిన స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..?!

సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. అయితే మామూలుగా సాధారణ వ్యక్తులు వివాహం చేసుకుంటే అంత సెన్సేషనల్ కాదు. కానీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ ఇలా పెళ్లి చేసుకుంటే అది నెటింట‌ సంచలనంగా మారుతుంది. ఇక ఇండస్ట్రీలో వ్యక్తిని పెళ్లి చూసుకుంటే అది మరింత వైరల్ గా మారుతుంది. ఇప్పుడు పర్లేదు కానీ.. గతంలో అయితే పెళ్లయిన హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మరో హీరోయిన్ తో మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం.. ఎవరినైనా రెండో పెళ్లి చేసుకోవడం చాలా సార్లు జరిగాయి. ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

అప్పట్లో హీరోయిన్ కృష్ణకుమారిని ప్రేమిస్తున్నారంటూ.. వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ అప్పటికే ఎన్టీఆర్ కు పెళ్ళై 13 మంది పిల్లలు ఉన్నారు. కాగా ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో కేవలం ఆయనతో 47 మంది హీరోయిన్స్ మాత్రమే వర్క్ చేశారు. అందులో జమున 36 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సావిత్రి 26, అంజలి 26, కృష్ణకుమారి 25 సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక కృష్ణ కుమారి ఎన్‌టీఆర్ మ‌ధ్య బందం చాలా గొప్పగా ఉండేది. పెళ్లి వరకు వెళ్లి చివరి రోజు క్యాన్సల్ చేసుకున్నారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. వాటికి కారణాలు ఏంటో తెలియదు కానీ.. పెళ్లి మాత్రం జరగలేదు.

అదే కోపంతో కృష్ణకుమారి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయారట‌. ఆ టైంలో 17 సినిమాలను ఒప్పుకున్న ఆమె అన్ని సినిమాల డైరెక్టర్లతో మాట్లాడి సినిమాలను క్యాన్సిల్ చేసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చేసారట‌. ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో అజయ్ మోహన్ అనే బెంగళూరు బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే అజయ్ కూడా అప్పటికే వేరే వివాహం చేసుకున్నాడు. అజయ్ కృష్ణకుమారి లది కూడా ప్రేమ వివాహమే. అయితే కేవలం ఎన్టీఆర్ పెళ్లి చేసుకోలేదన్న కోపంతోనే టాప్ పొజిషన్ లో ఉన్న కృష్ణకుమారి 17 సినిమాలను క్యాన్సిల్ చేసుకుని.. రెండో పెళ్లి వాడిని వివాహం చేసుకుని బెంగళూరులో సెటిల్ అయ్యారట.