పవన్, చెర్రీ ఫోటోలతో పెళ్లి పత్రిక ప్రింట్ చేయించుకున్న అభిమాని.. ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్..!!

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బాబాయ్, అబ్బాయిలు కెరీర్ పరంగా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవన్ ఓజీ, ఉస్తాద్‌ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించినా.. తాజాగా అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంద‌ని అఫీషియ‌ల్గా అనౌన్స్ చేసింది.

దీంతో ఈ సినిమా ఆగిపోలేదన్న క్లారిటీ వచ్చింది. ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్‌ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నాతో మరో సినిమా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. కాగా ఈ మెగా హీరోలు ఇద్దరు రెమ్యూనరేషన్లు కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని మెగా హీరోల పై తన రీతిలో అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫోటోలతో తన శుభలేఖను ప్రింటింగ్ చేయించుకోవడం గమనార్హం.

వెస్ట్ గోదావరి జిల్లాలోని అత్తిలికి చెందిన ఉమామహేశ్వర్ అయ్యప్ప, అనూష అనే జంట వివాహం ఫిక్స్ అయింది. ఈనెల 27న ఈ వివాహం జరగనుంది. అయ్యప్ప.. పవన్, చరణ్ పై ఉన్న అభిమానంతో వారిద్దరి ఫోటోలను పెళ్లి కార్డ్‌ ప్రింట్ చేసుకున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఆ పెళ్లి కార్డును చూసి అయ్యప్ప అభిమానానికి ఫీదా అవుతున్నారు. ఇక పవన్, చెర్రీ ఇద్దరు తమ టాలెంట్ తో ఎంతోమంది డై హార్ట్ ఫాన్స్ ను సంపాదించుకున్నారన‌టానికి ఇది ఓమంచి ఉదాహ‌ర‌ణ‌.