జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన నానిగాడు.. ప్రభాస్ తరువాత ఆ స్ధానం మన హీరోదే..!

అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో..? ఎవరు చెప్పలేరు .. అది ఎప్పుడైనా రావచ్చు.. ఎప్పుడైనా పోవచ్చు . ప్రెసెంట్ నాని బ్యాక్ పాకెట్ లో ఉంది అదృష్టవంటున్నారు అభిమానులు . ఈ మధ్యకాలంలో నాని ఎలాంటి ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నాడో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నాని దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం అభిమానులకి హ్యాపీనెస్ క్రియేట్ చేసింది.

రీసెంట్గా “సరిపోదా శనివారంతో..” మరో హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు నాని . కాగా ఇలాంటి క్రమంలోనే నాని మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . మాస్ మహారాజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన విక్రమార్కుడు సినిమాకి త్వరలోనే సీక్వెల్ రాబోతుందట . ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ పలు ఇంటర్వ్యూలలో పరోక్షంగా స్పందిస్తూ వస్తున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ కాకుండా నాని హీరోగా కనిపించబోతున్నాడట. విక్రమార్కుడు సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే . మరి అలాంటి సినిమాకి వచ్చే సీక్వెల్లో నాని నటిస్తే ఇక మాటలు అవసరం లేదు.. ఓన్లీ క్లాప్స్ అంటున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . నాని అభిమానులు ఈ సినిమాతో మరొక కొత్త నానిని చూడబోతున్నాం అంటూ ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..? ఎలాంటి నటనతో మెప్పిస్తాడో..?