సినిమాలే కాకుండా యాడ్స్ తోను కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే. .?!

ఇటీవల కాలంలో స్టార్ హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే ఏళ్లకు ఏళ్ల టైం పట్టేస్తుంది. అలాగే దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోతే మాత్రం వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే డబ్బులు సంపాదించడానికి కేవలం సినిమాలో మాత్రమే కాకుండా మన టాలీవుడ్ హీరోస్ అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరి చేతిలో దాదాపు అరడజన్ బ్రాండ్స్ వరకు ఉంటాయి.

Anil Ravipudi and Trivikram Srinivas donate Rs 10 Lakhs

వీటితో వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారట‌ స్టార్ హీరోస్. అయితే వీటిని తీస్తున్న హీరోలే కాదు.. యాడ్స్ తెరకెక్కిస్తున్న డైరెక్టర్స్‌లో కూడా కొంత‌మంది కోట్లలో చార్జ్ చేస్తున్నార‌ట‌. హీరోలతో సినిమాలో మాత్రమే కాదు.. మేము యాడ్ ఫిలిమ్స్‌ కూడా తెరకెక్కించగలం అంటూ మన టాలీవుడ్ డైరెక్టర్ ఒక్కో యాడ్ కు నాలుగైదు రోజుల టైం పెట్టి మరి ఆ యాడ్ ఫిలిం ను రూపొందిస్తున్నారు. అయితే వీటి ద్వారా వారు కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అందుకే అటు హీరోలు, ఇటూ డైరెక్టర్లు కూడా సైడ్ బిజినెస్‌గా యాడ్ ఫిలిం మేకింగ్ అప్ష‌న్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో త్రివిక్రమ్ ఈ యాడ్ డైరెక్షన్లో మెరుస్తున్నాడు. ఆయన చాలా రోజులుగా ఇందులో పనిచేస్తున్నాడు.

Boyapati Srinu interview: Riding high on emotion - The Hindu

ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన చాలా యాడ్స్ త్రివిక్రమ్ తెరకెక్కించాడట. అలా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో అనిల్ రావిపూడి.. మహేష్ బాబుతో ఒక యాడ్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రాజేంద్రప్రసాద్ కూడా కనిపించనున్నారు. వీళ్ళు మాత్రమే కాదు తరుణ్ భాస్కర్, కృష్‌, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు కూడా సినిమాలకన్నా యాడ్ ఫిలిమ్స్ ను ఎక్కువ సంఖ్యలో షూట్ చేసి డబ్బులు కూడా వాటికి తగ్గట్టుగానే తీసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో హీరోలు కూడా చిన్న డైరెక్టర్స్ కాకుండా పెద్ద డైరెక్టర్ ఈ యాడ్ ఫిలిం షూట్ చేస్తేనే తీస్తాము అనే రేంజ్ కు యాడ్ ఫిలిమ్స్ వెళ్లిపోయేలా కనిపిస్తున్నాయి. ఎలక్షన్ నేపథ్యంలో పార్టీలకు సంబంధించిన యాడ్ ఫిలిమ్స్ కు మరింత క్రేజ్ పెరుగుతుంది.