సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి మ్యాటర్ .. ఏజ్ పెళ్లి వయసు దాటిపోతుంది ..ఇంకా పెళ్లిపై అస్సలు స్పందించడం లేదు ఈ హీరో . అసలు పెళ్లి చేసుకుంటాడా..? లేదా..? అన్నది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది . ఇలాంటి క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ తన పెళ్లి పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.
అయితే సదరు యాజమాన్యం ఆ మాటలను క్రాప్ చేసేసి ప్రభాస్ నార్మల్ గా మాట్లాడిన మాటలని టెలికాస్ట్ చేయడం ఇప్పుడు హైలైట్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ బిజీగా సినిమాల విషయంలో ముందుకెళ్తున్న ప్రభాస్ రీసెంట్గా ఓ బాలీవుడ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడట. ఈ క్రమంలోనే పెళ్లిపై కూడా ప్రస్తావన వచ్చింది. అందరూ అనుకున్నట్టే డార్లింగ్ ని హోస్ట్ పదేపదే పెళ్లి గురించి ప్రశ్నించడంతో కోపంతో పెళ్లిపై రియాక్ట్ అవ్వక తప్పని పరిస్థితి లో ఘాటుగా స్పందించాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
“అందరూ పెళ్లి పెళ్లి అంటున్నారు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో అందరికీ తెలుసు. నేను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో గొడవలు వస్తే మీరు వచ్చి తీర్చుతారా ..? మీరు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారా ..? ఎవరి ప్రొబ్లెంస్ వాళ్ళవి .. ఫ్యాన్స్ కూడా కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం మంచిది” అంటూ ఘాటుగా స్పందించారట. ఆ తర్వాత టెక్నికల్ టీం తో చెప్పి ఆ మాటలను క్రాప్ చేయించేసాడట. పర్సనల్ ఇంటర్వ్యూ టీం ద్వారా ఈ విషయం బాలీవుడ్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. ఫస్ట్ టైం పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటో ప్రభాస్ చెప్పేసాడు అంటూ జనాలు సైతం ఈ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!