జాన్వీ-సారా-దీపికా-ప్రియాంకా.. ఈ బ్యూటీస్ అందరికి ఆ తెలుగు హీరో అంటేనే ఇష్టం..ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకే హీరోని ఇష్టపడే హీరోయిన్స్ చాలా చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు . అలాంటి వాళ్లు అందరూ కత్తిలాంటి ఫిగర్లే అయితే .. వామ్మో ఇంకేమైనా ఉందా ..?? ఆ హీరో పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తూ ఉంటారు అభిమానులు . ప్రజెంట్ అదేవిధంగా సోషల్ మీడియాలో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాడు మన తెలుగు హీరో .. ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన రేంజ్ ఆఫ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతుంది . పలు ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్ – సారా అలీ ఖాన్ -దీపికా పదుకొనే – ప్రియాంక చోప్రా అందరూ కూడా తెలుగు హీరో అల్లు అర్జున్ తో నటించాలి ఉంది అంటూ మనసులోని కోరికను బయటపెట్టారు.

అల్లు అర్జున్ అంటే క్రష్ అన్న విషయాన్ని సైతం ఓపెన్ గా చెప్పేశారు . పెళ్లై పిల్లలున్న హీరోకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ రేంజ్ లో పడిపోతున్నారు అంటే అల్లు అర్జున్ రేంజ్ ఆఫ్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .. ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమా ..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మరొక సినిమాను కమిట్ అయి ఉన్నాడు..!!