బన్నీ కోసం అలా మారిపోయిన సమంత.. లెటేస్ట్ పోస్టర్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన వెబ్ సిరీస్ సిటాడిల్. హాలీవుడ్ లో ఓ రేంజ్ లో హిట్ అయి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ దావణ్ నటించారు . ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసేశారు . త్వరలోనే ఆడియన్స్ ముందుకు ఈ సిరీస్ రాబోతుంది . కాగా తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ పోస్టర్ తో క్రేజీ మ్యాటర్ లీక్ అయిపోయింది. సిటాడిల్ టైటిల్ ని అలాగే ఉంచేసి అడిషనల్ గా హనీ – బన్నీ అని పేరు పెట్టారు మేకర్స్ . ఈ టైటిల్ డిజైన్ తోని హనీ అంటే సమంత అని .. బన్నీ అంటే వరుణ్ దావన్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట ఈ సీరిస్. కచ్చితంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కి మించిన రేంజ్ లోనే ఈ సిరీస్ లో సమంత ఆకట్టుకుపోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు రిలీజ్ అయిన కొత్త పోస్టర్లో సమంత పిక్ హైలెట్ గా మారింది. చాలా మోడ్రన్ గా కనిపించబోతుంది అంటూ ఫస్ట్ పోస్టర్ తోనే చెప్పేసారు మేకర్స్. ఈ సిరీస్ కోసం సమంత ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. అంతేకాదు ఈ సిరీస్ కోసం సపరేట్ డైట్ కూడా ఫాలో అయింది సమంత.. అదేవిధంగా ఈ సిరీస్ కోసం ఆమె ఏకంగా 10 కోట్లు ఛార్జ్ చేసినట్లు ఓ న్యూస్ అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. చూద్దాం మరి సిరీస్ ఎలా జనాలను మెప్పించబోతుందో..???

 

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)