శ్రీముఖీ-సుమ అభిమానులకి బిగ్ షాక్.. చూస్తూ చూస్తూనే మంటపెట్టారుగా..!!

ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పే ఒకే ఒక్క పేరు సుమ . చిన్న కాదు పెద్ద కాదు అందరికీ సుమక్కగా బాగా దగ్గరయిపోయింది . నో వల్గారిటీ.. నో డబల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ తనకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఇండస్ట్రీలో ఎప్పటికీ నెంబర్ వన్ యాంకర్ అని అంతా అనుకున్నారు. కానీ తాజా సర్వేలో సుమకు బిగ్ షాక్ తగిలింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ యాంకర్స్ గా ఉన్న యాంకర్ శ్రీముఖి – యాంకర్ సుమలకు ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్ మాక్స్ బిగ్ షాక్ ఇచ్చింది . తాజాగా సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి . ఫిబ్రవరి నెలకు గాను మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీ విభాగంలో టాప్ ఫైవ్ లో సుమా కనకాల – శ్రీముఖీలకు చోటు దక్కలేదు . దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . మొదటి స్థానంలో హైపర్ ఆది ఉండగా రెండవ స్థానంలో సుడిగాలి సుధీర్ ఉండడం గమనార్హం .

ఆ తర్వాత స్థానంలో రాంప్రసాద్ ..ఆ తర్వాత స్థానంలో రష్మీ..ఆ తరువాతి స్ధానంలో ప్రదీప్ మాచిరాజు ఉండడం అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది . ఇండస్ట్రీ ను లీడ్ చేసే ఇద్దరు టాప్ ఫిమేల్ యాంకర్స్ ఈ సర్వే సంస్థలో చోటు దక్కించుకోకపోవడం సంచలనంగా మారింది. అయితే దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆ సంస్థ చేసే సర్వే నిజమో అబద్దమో తెలియదు కానీ .. ఈ మధ్యకాలంలో శ్రీముఖి – సుమల పేర్లు బయట తక్కువగా వినిపిస్తున్నాయి అని వాళ్లు కూడా యాంకరింగ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ జనాలు సైతం చెప్పుకు రావడం గమనార్హం..!!