స్కూల్ డేస్ లోనే అలా చేస్తూ సురేఖ వాణికి దొరికిపోయిన కూతురు సుప్రీత.. పిల్ల మహాముదురే.. !!

టాలీవుడ్ స్టార్ సెలెబ్రెటీ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సురేఖ. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కూతురు సుప్రతాను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సురేఖ‌. అమర్‌దీప్‌ చౌదరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సుప్రీత హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్గా జరిగింది.

ఈ నేపద్యంలో అమర్, సుప్రీత కలిసి ఓ టాక్ షో కి హాజరై సందడి చేశారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా ఉన్న దావత్ షోలో వీరిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక ఈ షోలో రీతు కొంచెం పచ్చి బూతు ప్రశ్నలతో.. తన గెస్ట్‌ల‌ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. అలా అమర్, సుప్రీత్యాలను కూడా కిక్ కోసం, క్రాక్ లో, బలుపుతో చేసిన పనులు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. అయితే దీనికి సుప్రీతా సమాధానం చెబుతూ.. కిక్ కోసం చేసిన పనులు అయితే 15,16 ఏళ్ళ వయసులోనే లైసెన్స్ లేకుండా మా అమ్మ కార్‌ తీసుకొని బయటికి వెళ్లిపోయేదాన్ని.. అప్పుడు అమ్మ నన్ను చితక్కొట్టేది అంటూ సుప్రీత వివరించింది.

అది కాకుండా ఇంకా కిక్కు కోసం నువ్వు ఏం పనులు చేసావో చెప్పు అంటూ రీతూప్రశ్నించగా స్కూల్ డేస్ లో నా ఫ్రెండ్స్ కి స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాలని ఉండేది.. ఒక రోజు అమ్మకు తెలియకుండా ఓ మందు బాటిల్ తీసుకెళ్లి స్కూల్లో అందరికీ తాగించేసా.. అంటూ వివరించింది. అయితే ఆ విషయం మా కో ఆర్డినేటర్‌కి తెలిసిందని సుప్రిత చెప్పుకొచ్చింది. ఇక క్రాక్ లో చేసిన పనులు అయితే నేను ఇష్టపడిన అబ్బాయిని ఎవరైనా అమ్మాయి చూస్తే వెంటనే అమ్మాయిని వెళ్లి కొట్టేసే దాన్ని అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో వామ్మో ఈ పిల్ల మహా ముదురే ఆ ఏజ్ లోనే అలాంటి పనులు చేసి దొరికిపోయిందా అంటూ అంత కామెంట్స్ చేస్తున్నారు.