సిద్దు-నాగచైతన్య కంటే ముందే “ఐ లవ్ యు” అంటూ.. సమంతని ఏడిపించిన ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే కుర్రాళ్ల ను మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసిందో తెలియదు కానీ ..ఏం మాయ చేసావే సినిమా ద్వారా మాత్రం అందరి కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది.

ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా కొంతమంది మొబైల్ వాల్ పేపర్స్ లో సమంత ఫొటోస్ నే ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తర్వాత మరింత యాక్టివ్గా మారింది . రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత గతంలో హీరో సిద్ధార్ధ్ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి .

ఆ తర్వాత నాగచైతన్యని పెళ్లి చేసుకుంది.. విడాకులు కూడా ఇచ్చేసింది. అయితే వీళ్ళిద్దరి కంటే ముందే సమంత లైఫ్ లో ఓ స్టార్ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాడట . సమంత కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడే ఒక బడా పొలిటిషియన్ కొడుకు సమంతని ప్రేమ పేరుతో బాగా ఇబ్బంది పెట్టాడట. అయితే అప్పట్లో ఆమె ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక సమంత ప్రేమ – దోమ అంటూ తిరగకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ తన కెరియర్ పైనే చేసిందట . ఈ విషయం ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!