తేజ సజ్జాకు ఆ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహేష్.. అసలు ఏం జరిగిందంటే.. ?!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి కాంట్రవర్సీస్ లో ఇన్వాల్వ్ కాకుండా జెంటిల్‌మ్యాన్ గా క్రేజ్ ను సంపాదించుకుంటూ స్టార్ హీరోగా వరుస‌ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్.

అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా కు పోటీగా యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాగా.. వాటిలో మహేష్ బాబు కంటే తేజ సినిమాకి ఎక్కువ సక్సెస్ అందింది. అయితే హనుమాన్ మూవీ ప్రమోషన్స్ తర్వాత తేజసజ్జ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. తనను ఓ విషయంలో మహేష్ తిట్టారని.. ఆయన వివరించాడు. యువరాజ్ మూవీలో మహేష్ బాబు కొడుకుగా తేజా సజ్జ నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ మహేష్ గురించి టాపిక్ రాగా.. యువ‌రాజు టైంకి నేను చాలా చిన్న పిల్లవాడు కావడంతో మహేష్ బాబును.. మగేశ్‌ బాబు, మగేశ్‌ బాబు అంటూ పిలిచేవాడినని అందుకు మహేష్ బాబు కాస్త ఫీలై నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌ని వివ‌రించాడు. నీకు పిలవడం రాకపోతే మానేయి. అంతే కానీ అలా మాత్రం పిలవకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఆ విషయాన్ని స్వయంగా తేజ సజ్జ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చాడు. మహేష్ బాబుతో తనకున్న స్వీట్ మెమరీస్ ను గుర్తు చేసుకున్నాడు. అయితే మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిసి నటించిన తేజ ప్రస్తుతం మహేష్ తో పోటీగా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.