ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో స్టార్ కిడ్.. స్టోరీస్ సెలక్షన్ స్టార్ట్ చేసిందంటూ నటి కామెంట్స్..

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ ఊర్వశికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా కనిపించింది. ఆ తర్వాత.. ఊర్వశి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపింది. అయితే కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమై ఇంట్లోనే ఉంటున్న ఊర్వ‌శి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంద‌డి చేసింది. తన కూతురు సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ నా కూతురు తేజ లక్ష్మి వయసు 23 ఏళ్ళని.. ఆమె నటించడానికి సిద్ధంగా ఉందంటూ వివరించింది.

అయితే ఇన్ని సంవత్సరాలు నా కూతుర్ని సినిమాలో యాక్ట్‌ చేయనివ్వలేదు.. దానికి కారణం స్టార్ వారసులు ఇండస్ట్రీలో నటించడానికి వస్తే.. తల్లిదండ్రుల ప్రభావంతో జనాలు వాళ్ళని ట్రీట్ చేస్తారు. అందుకే చిన్న నటినటుల‌ వారసులకు ఇది ప్రధాన ఇబ్బందిగా ఉంటుంది. కనుక నేను నా కూతుర్ని సినీ రంగంలోకి రాకుండా చదువు పూర్తి చేయమని చెప్పుకొచ్చా అంటూ ఆమె కామెంట్స్ చేసింది. ఇక ఇటీవల తేజ తన చదువు విదేశాల్లో పూర్తి చేసిందని.. తన ఫ్రెండ్స్ అంతా తనను నటించమని సజెస్ట్ చేస్తున్నారని వివ‌రించింది.

తేజ‌కు కూడా నటించాలని ఉందంటూ ఊర్వ‌శికి చెప్పిందట‌. దాంతో నేను కూడా ఓకే చేశానని చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు తేజ ప్రస్తుతం కొన్ని కథలను వింటుందని.. ఏదైనా స్టోరీ నచ్చితే హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ వివరించింది. అయితే ముందు నుంచి కూడా ఆమె సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. అయినా ఆమె విధి ఇండస్ట్రీ వైపు నడిపిస్తుంది అంటూ దాన్ని ఎవరు మార్చలేము కదా.. విధి ఎటు తీసుకుపోతే అటు అడుగులు వేయాలి అంటూ ఊర్వశి వివరించింది. ప్రస్తుతం ఊర్వశి చేసిన కామెంట్స్ తో పాటు ఆమె కూతురు పిక్స్ వైరల్ గా మారాయి.