విరూపాక్ష సినిమాల్లో హీరో ఛాన్స్ నాకే వచ్చింది.. బిగ్ బాస్ అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్..?!

బుల్లితెర సీరియల్ నటుడు అంబటి అర్జున్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సీరియల్స్ లో హీరోగా నటించిన ఈయన.. కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలో నటించి మెపించాడు. ఇక తాజాగా బిగ్‌బాస్‌ సీజన్ 7లో కంటెస్టెంట్ గా వ్యవహరించి భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెండితెరపై ఎన్నో సినిమాలు అవకాశాలను అందుకుంటు.. న‌ట‌న పరంగా బిజీ అయ్యాడు. ఇక అర్జున్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

ముఖ్యంగా విరూపాక్ష సినిమా గురించి మాట్లాడుతూ.. ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో హీరోగా నేను నటించాల్సిందని.. అర్జున్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్, నేను మంచి స్నేహితులమని.. మా ఇద్దరి కాంబోలో వెబ్ ఫిలిం కూడా వచ్చిందని చెప్పుకొచ్చాడు. విరూపాక్ష సినిమా కథను మొదట కార్తీక్ రాసుకుని నాకు వినిపించారని. ఇద్దరం కలిసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు.

అయితే నిర్మాతల కోసం రెండు సంవత్సరాల పాటు ఎంత తిరిగినా మా ఇద్దరితో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రాలేదని.. అది వర్కౌట్ కాకపోవడంతో కార్తీక్.. సాయి ధరంతేజ్‌ను కలిసి కథ వినిపించారని.. ఆయనకు కథనాచడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చి సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయినందుకు నేను.. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానని ఎప్పుడు బాధపడలేదు. కార్తీక్ నాతో సినిమా చేసి ఉంటే అంత సక్సెస్ వచ్చేది కాదేమో అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.