ఆ స్టార్ డైరెక్టర్ తో శృతిహాసన్ రొమాన్స్.. ఫిక్స్ వైరల్..

విశ్వ నటుడు కమల్ హాసన్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కాంపౌండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు హీరోగా రాణిస్తూనే మరో వైపు ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి తనదైన స్టైల్ లో సినిమాలను రూపొందిస్తున్నాడు క‌మ‌ల్‌. ఇక తాజాగా ఆర్కే బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ థోమ్‌తో కలిసి కమలహాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమోల్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఆ మ్యూజిక్ ఆల్బమ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా న‌టిస్తూ రొమాన్స్‌తో రెచ్చిపోయారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ప్రోమో చూస్తేనే అది క్లియర్ గా అర్థమవుతుంది.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 18 సెకండ్ల ప్రోమోలో మ్యూజిక్ బిట్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి రొమాన్స్ మాత్రం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. ఈ ఎనిమల్ ఫుల్ సాంగ్ తెలుగు, తమిళ్ భాషలో మార్చి 25న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమో నెట్టింట వైరల్ అవడంతో అభిమానులంతా ఫిదా అవుతున్నారు. కేవలం సాంగ్ కాదు.. ఈ కాంబోలో సినిమా కావాలి అంటూ.. వీరిద్దరి రొమాన్స్ అదిరిపోయింది అంటూ త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకి శృతిహాసన్ న‌ట‌న‌తో పాటు కాన్సెప్ట్ కూడా అందించారని టాక్.

ఇక ఈ ఇనిమల్ మ్యూజిక్ ఆల్బమ్ కు కమలహాసన్ లిరిక్ రైటర్ గా వ్యవహరించాడు. ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న మ్యూజిక్ వీడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఎన్ని స్పెషాలిటీస్ తో రూపొందుతున్న ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ద్వారకేష్ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో కమల్‌హాసన్, శృతిహాసన్, లోకేష్ క‌న‌గ‌రాజ‌న్ త‌మ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నా కూడా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా వాటిని ప‌క్క‌న పెట్టి మ‌రి తెరకెక్కిస్తున్నారంటే ఈ మ్యూజిక్ లో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అని తెలుగు, తమిళ ప్రేక్షకులో ఆసక్తి మొదలైంది. ఇక ఈ సాంగ్ రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.