పాపం.. నాగచైతన్య కు మరో కొత్త ప్రాబ్లమ్.. టైం చూసి దెబ్బెశారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. నాగచైతన్య కెరియర్ దెబ్బతీసే ప్లాన్ చేస్తున్నారా..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనందరం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన పనిలేదు . ఆయనకంటూ స్పెషల్ ఇమేజ్ ఉంది. అయితే పెద్ద హీరో అని చెప్పుకోలేము కానీ తీసిన సినిమాలలో బాగా నటిస్తాడు .

రీసెంట్గా నాగచైతన్య తండేల్ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనకు తెలిసిందే.. కాగా తండేల్ సినిమా మొత్తం సముద్రపు బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కబోతుంది . శ్రీకాకుళం నుంచి ఒక మత్స్యకారులు బార్డర్ క్రాస్ చేస్తే ఎదుర్కొని పరిస్థితులకు సంబంధించిన కథతో ఈ సినిమాను చందు మొండేటి తెరకెక్కించబోతున్నారు. ఇప్పుడు నాగచైతన్యకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది .

సేమ్ ఇంచుమించు ఇదే విధంగా ఉండే కథతో ఓటీటీలో త్వరలోనే ఓ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ తెలుస్తుంది . క్రిష్ దర్శకత్వంలో అరేబియన్ బీచ్ అనే ఓ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమా కూడా ఇంచుమించు కధ అంతా ఇలాగే ఉంటుందట. దీంతో ఇప్పుడు నాగచైతన్య ఫ్యాన్స్ కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం ..తండేల్ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు .

అయితే అరేబియన్ బీచ్ సినిమాను ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. తండేల్ సినిమాలాగే కథ మొత్తం ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక తండేల్ ను థియేటర్స్ లో ఎవరూ చూడరు . ఇది నాగచైతన్య కెరీర్ కు బిగ్ రిస్క్ అనే చెప్పాలి. నాగచైతన్య లేక లేక హిట్ కొడతాడు అని ఆశపడేలోపే ఇలాంటి ఒక సిచువేషన్ ఆయనకు ఎదురవ్వడం ఫాన్స్ కి సైతం ఇబ్బందికరంగా ఉంది..!!