వామ్మో.. రాజమౌళి కంటే ఆయన భార్య ఏజ్ లో అంత పెద్దదా..? ఇదేం ట్విస్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయనకి ఉన్న రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే . బాహుబలి – మగధీర – ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . త్వరలోనే మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కించబోతున్నారు .

ఈ సినిమాతో ఇండస్ట్రీకి మరో గ్లోబల్ అవార్డు రావడం పక్కా అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . ఇదే క్రమంలో రాజమౌళి పర్సనల్ విషయాలు కూడా నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . రాజమౌళి భార్య ఆయన కంటే వయసులో పెద్దది అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రాజమౌళి రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .

వీళ్ళ లవ్ స్టోరీ అందరికీ తెలిసిన విషయమే.. ఆల్రెడీ రమా కి పెళ్లయింది .. ఒక బాబు కూడా ఉన్నాడు . అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజమౌళి . ఈ జంట చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటుంది . ఒక బిడ్డను దత్తత తీసుకొని లైఫ్ ఇచ్చారు . రాజమౌళి కంటే రమా వయసులో నాలుగేళ్లు పెద్దదట . ఈ విషయం తాజా ఇంటర్వ్యూలో బయటపడింది . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!