బన్నీకి మరో అరుదైన గౌరవం.. ముహూర్తం అప్పుడే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ జాతియ నటుడిగా అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. టాలివుడ్‌లోనే ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న మొట్ట‌మొద‌టి హీరో అల్లు అర్జున్ కావ‌డం విశేషం. ఇక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన మైనపు విగ్రహాన్ని టుసాట్స్ లో ఏర్పాటు చేయనున్నట్టు గతంలోనే మేడం టుసాట్స్‌ మ్యూజియం అధికారులు అఫీషియల్ గా వెల్లడించారు.

దానికి సంబంధించి అల్లు అర్జున్ కొలతలను అక్టోబర్‌లో స్వీకరించడం జరిగింది. దీంతో తమ ఫేవరెట్ హీరో విగ్రహం ప్రారంభోత్సవం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా అభిమానుల నిరీక్షణకు చెక్ పడింది. బన్నీ మైనపు విగ్రహ ప్రారంభోత్సవ స‌మ‌యం రానే వ‌చ్చింది. మార్చి 28న అల్లు అర్జున్ మైన‌పు విగ్రహా ఆవిష్కరణ జరగనుంది.

ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు బన్నీ దుబాయ్ వెళ్తున్నారట.. మార్చి 28న రాత్రి 8 గంటలకు ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది.. ఈ విషయం దుబాయ్ టు సాట్స్‌ మ్యూజియం నిర్వహకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో బన్నీ విగ్రహం ఎలా ఉండబోతుందో అని ఆసక్తితో పాటు.. ఫాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇక అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే పుష్పా 2 తో మ‌రోసారి రికార్డ్‌లు బ్రేక్ చేసి..మ‌రిని సంచ‌ల‌నాలు సృష్టించ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ మూవీ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.