సూర్యను నాకు భర్తగా అప్పు ఇస్తావా.. నెటిజన్ ప్రశ్నకు జ్యోతిక స్ట్రాంగ్ రిప్లై..?!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత వారి ఫేవరెట్ హీరో, హీరోయిన్లతో ఫాన్స్ మరింత చేరువవుతున్నారు. నెటింట‌ వేదికగా సెలబ్రిటీస్ కూడా తమ డైలీ లైఫ్ గురించి తమ వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. పలు సందర్భాల్లో వారితో ముచ్చటించి వారిపై అభిమానాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. అయితే ఇలా ఫ్యాన్స్ తో ముచ్చటించే టైంలో సెలబ్రెటీస్‌కు కొన్ని వింత ప్రశ్నలు ఎదురవడం సర్వసాధారణం. అలానే తాజాగా తెలుగు, తమిళంలో స్టార్ట్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక ఇటీవల తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్‌ జ్యోతికకు వింత ప్రశ్న సందించింది. దానిపై జ్యోతిక సూపర్ కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఆ నెటిస‌న్‌ ప్రశ్న ఏంటి.. జ్యోతిక ఎలా రియాక్ట్ అయిందో.. తెలుసుకుందాం.

ఫ్యాన్స్‌తో జ్యోతిక‌ ముచ్చటిస్తున్న నేపథ్యంలో తర్సెని సూర్య అనే ఓ నెటిజన్.. జ్యోతిక మేడం సిలును ఒరు కాదల్ సినిమాలోలా నాకు మీ భర్తను ఓ రోజు అప్పుగా ఇస్తారా.. 15 ఏళ్లగా నేను సూర్యకు చాలా పెద్ద ఫ్యాన్.. అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో.. జ్యోతిక దానికి రిప్లై ఇచ్చింది. హుఫ్‌.. అలాంటిదేమీ కుదరదు అంటూ ఆమె స్పందించింది. అయితే జ్యోతిక ఇచ్చిన రిప్లై న‌చ్చ‌డంతో ఫ్యాన్స్ అంతా లైకులు కురిపించారు. ఇక దీంతో తర్సెని సూర్య, జ్యోతిక మధ్యన ఓ చిన్న సంభాషణ జరిగింది. జ్యోతిక ఆన్స‌ర్‌కు స‌ద‌రు నెటిజ‌న్ దేవుడా.. ఓరి దేవుడా.. మీరు నాకు బదులిచ్చారని నమ్మలేకపోతున్నా.. నేను సూర్యకి పెద్ద అభిమానిని.. నా పేరు కూడా ఆయన పేరులా పెట్టుకున్నా.. అయితే మీ ప్రేమ ముందు నేనంతలే.. సూర్య ఎప్పటికీ మీ వాడే.. అంటూ ఆమె రిప్లై ఇచ్చింది.

ఇక దీనికి జ్యోతిక కూడా క్యూట్ ఇమేజస్‌తో రిప్లై ఇచ్చింది. ఇలా వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది. జ్యోతిక తరచూ తన అభిమానులతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమెపై అభిమానాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జ్యోతిక ఆచితూచి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అజయ్ దేవగణ్‌తో కలిసి షైతాన్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక భర్త సూర్య కంగువ షూటింగ్‌లో బిజీగా గ‌డుపుతున్నారు. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసింది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతుంది.